Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. వారానికి 4 రోజులు కరీంనగర్ – తిరుపతి రైలు

|

Dec 23, 2023 | 10:13 AM

కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు సదుపాయం మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని కోరిన కోరికకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి.. కరీంనగర్- తిరుపతి మధ్య రెండు రోజులు నడుస్తున్న రైలును.. ఇకపై వారానికి నాలుగు రోజులు నడపాలని అధికారులను ఆదేశించారన్నారు బండి సంజయ్‌. మరోవైపు.. పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఎదురవుతున్న సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు.

Bandi Sanjay: కరీంనగర్ ప్రజలకు గుడ్ న్యూస్.. వారానికి 4 రోజులు కరీంనగర్ - తిరుపతి రైలు
Bandi Sanjay
Follow us on

కరీంనగర్ ప్రజలకు.. ముఖ్యంగా శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పారు ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి వెళ్లే రైలు ఇకపై వారంలో నాలుగు రోజులు తిరుగుతుందన్నారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఢిల్లీలో కలిసి కరీంనగర్- తిరుపతి రైలుతోపాటు ఇతర రైల్వే సంబంధిత సమస్యలు వివరించినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి.. కరీంనగర్- తిరుపతి మధ్య రెండు రోజులు అంటే గురువారం, ఆదివారం మాత్రమే నడుస్తున్న రైలును.. ఇకపై వారానికి నాలుగు రోజులు నడపాలని అధికారులను ఆదేశించారన్నారు బండి సంజయ్‌. అయితే ఈ నిర్ణయం ఎప్పుటి నుంచి అమలు అవుతుందో ఏఏ రోజుల్లో నడవనుందో రేపు ప్రకటించనున్నారని తెలిపారు.

మరోవైపు.. పెద్దపల్లి- నిజామాబాద్ రైల్వే లైన్‌లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా ఎదురవుతున్న సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామన్నారని చెప్పారు. అలాగే.. కరీంనగర్- హసన్‌పర్తి కొత్త రైల్వే లైన్ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని కేంద్రమంత్రి అధికారులను ఆదేశించారన్నారు. ఇక.. జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో తెలంగాణ ఎక్స్ ప్రెస్, దానాపూర్ ఎక్స్ ప్రెస్, నవజీవన్ , గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించే అంశాన్ని పరిశీలిస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు బండి సంజయ్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..