పోలీసులనే షాక్‌కు గురి చేసిన ఆటోవాలా.. ఏకంగా 16 మంది ప్రయాణం. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు.

మహబూబ్ నగర్‌కు చెందిన ఓ ఆటోవాలా చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఏకంగా పోలీస్ శాఖే ఈ విషయమై ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే అతను చేసిన ఘనత ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపడక మానరు. ఇంతకీ విషయమేంటంటే..

పోలీసులనే షాక్‌కు గురి చేసిన ఆటోవాలా.. ఏకంగా 16 మంది ప్రయాణం. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు.

Updated on: Dec 18, 2020 | 8:47 PM

Telangana police tweet about auto driver: మహబూబ్ నగర్‌కు చెందిన ఓ ఆటోవాలా చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఏకంగా పోలీస్ శాఖే ఈ విషయమై ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అయితే అతను చేసిన ఘనత ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపడక మానరు. ఇంతకీ విషయమేంటంటే.. ఏడుగురు ప్రయాణించే ఆటోలో ఓ డ్రైవర్ ఏకంగా 16 మంది ఎక్కించాడు. దీనిని గమనించిన స్థానిక పోలీసులు ఆటోను ఆపి ఒక్కొక్కరిగా అందరినీ కిందికి దింపి, వరుసగా నిలబెట్టి ఫొటో తీశారు. అంతటితో ఆగని మహబూబ్ నగర్ పోలీసులు ఆ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇక ఇదే ఫొటోను తెలంగాణ స్టేట్ పోలీస్ రీ ట్వీట్ చేసింది. ఈ ఫొటోతో పాటు.. ‘ఏందన్నా! అది ఆటో నా ?? మినీ బస్సా ?? 7 సీటరా లేక 14 సీటరా ?? ఆటో నీది!, ప్రాణం ఆ అమాయకులది!, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది??’ అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.