సైబర్ నేరాలు అరికట్టేందుకు తెలంగాణ పోలీసుల యాక్షన్ ప్లాన్

|

Oct 23, 2020 | 5:58 PM

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడ్డారు.  రోజుకో తరహా కొత్తరకం సైబర్‌ నేరంతో ఖాకీలకు సవాల్ విసురుతున్నారు.

సైబర్ నేరాలు అరికట్టేందుకు తెలంగాణ పోలీసుల యాక్షన్ ప్లాన్
Follow us on

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో పోలీసుల ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి వసూళ్లకు పాల్పడ్డారు.  రోజుకో తరహా కొత్తరకం సైబర్‌ నేరంతో ఖాకీలకు సవాల్ విసురుతున్నారు. ఇక నకిలీ ఫోన్‌ నంబర్లను ఉపయోగించి గిఫ్ట్స్, ఆఫర్లు పేర్లతో పాత పద్దతులను కొనసాగిస్తూనే ఉన్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మరో కొత్త విధానంలో కంత్రీగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే వారికి చెక్‌ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు యాక్టన్ ప్లాన్ రెడీ చేశారు. మోసాలను అరికట్టేందుకు పూర్తి అస్త్రాలతో రంగంలోకి దిగుతున్నారు. ఫేక్ ఫోన్‌ నంబర్లు ఉపయోగించి మోసాలు చేస్తున్నవారికి చెక్‌ పెట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగించి సిమ్‌ కార్డులు తీసుకుని ఈ రకమైన నేరాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు, ధ్రువపత్రాలు సరిగా లేకున్నా అధిక మొత్తంలో సిమ్‌ కార్డులను ఇస్తున్న మూడు నెట్‌వర్క్‌ కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్దం చేశారు. ఇప్పటివరకు ఈ తరహా మోసాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో 11వేలకు పైగా కేసులు నమోదవ్వడం గమనార్హం.

సైబర్‌ నేరగాళ్లు కేటుగాళ్లు ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, కోల్‌కతాలో ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి సిమ్‌కార్డులు తీసుకుంటారు. ఓఎల్‌ఎక్స్‌లో సరసమైన ధరకు వాహనాలు, ఫోన్లు ఇతరత్రా వస్తువులు ఇస్తామంటూ, డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్‌లైన్‌ ద్వారా డబ్బులు పంపించాకా ఫోన్‌ ఆఫ్ చేస్తారు. రాజస్థాన్‌కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా ఆర్మీ అధికారుల ఫొటోలను, పేర్లను ఉపయోగిస్తోంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగు రెట్లు పెరిగాయని పోలీసులు వెల్లడించారు. దీనిపై ఓఎల్‌ఎక్స్‌ కంపెనీకీ నోటీసులు పంపుతామని పోలీసులు వివరించారు.

Also Read :

కృష్ణా జిల్లాలో విషాదం, కరెంట్ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి

టాలీవుడ్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన నిధి!