సోషల్ మీడియా బాగా విస్తరించిన ప్రస్తుత తరుణంలో తప్పుడు సమాచార ప్రభావం సొసైటీపై తీవ్రంగా ఉంటోంది. దీంతో తెలంగాణ పోలీసులు ఈ అబద్దపు వార్తా ప్రచారాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ప్రతీ పోస్ట్ ను నమ్మొద్దంటూ ఫేక్ న్యూస్ కు హ్యాష్ ట్యాగ్ జోడించి రాచకొండ కమిషనరేట్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ మాయాజాలంతో చూసినవన్నీ నమ్మి నవ్వులపాలవ్వొద్దంటూ సందేశమిస్తున్నారు. తెలిసీ తెలియని సమాచారాన్ని షేర్ చేసి సమస్యలకు కారణం కావొద్దంటున్నారు. ఇదే ఆ వీడియో..
Don’t trust every post on social media to be true.#FakeNews pic.twitter.com/tZGteSeKuQ
— Rachakonda Police (@RachakondaCop) August 24, 2020