ముగిసిన నామినేషన్ల పర్వం : హుజూర్ నగర్ బరిలో వీరే..!

| Edited By:

Sep 30, 2019 | 8:07 PM

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉపఎన్నిక బరిలో భారీగా అభ్యర్థులు పోటీలో నిలిచారు. దాదాపు 200పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అసంతృప్తులంతా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయగా… సర్పంచ్‌ల సంఘం తరపున 10 మంది నామపత్రాలు సమర్పించారు. చివరి రోజు కావడంతో ఉదయం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు పలువురు సర్పంచ్‌లు వేచి వున్నారు. అయితే ఏ కారణం చెప్పకుండా రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించేదని వారు వాపోతున్నారు. దీంతో సర్పంచ్‌లు […]

ముగిసిన నామినేషన్ల పర్వం : హుజూర్ నగర్ బరిలో వీరే..!
Follow us on

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉపఎన్నిక బరిలో భారీగా అభ్యర్థులు పోటీలో నిలిచారు. దాదాపు 200పైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అసంతృప్తులంతా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయగా… సర్పంచ్‌ల సంఘం తరపున 10 మంది నామపత్రాలు సమర్పించారు. చివరి రోజు కావడంతో ఉదయం నుంచి ఎన్నికల అధికారి కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు పలువురు సర్పంచ్‌లు వేచి వున్నారు. అయితే ఏ కారణం చెప్పకుండా రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించేదని వారు వాపోతున్నారు. దీంతో సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. సర్పంచ్ ఉప సర్పంచ్‌లకు కలిపి చెక్ పవర్ ఇవ్వడాన్ని నిరసిస్తూ.. 40 మంది సర్పంచ్‌లు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చినట్లు సమాచారం. వారి నామినేషన్లు ఎన్నికల అధికారులు తిరస్కరించారని.. వారు ధర్నా చేపట్టారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్ 1న ఈ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. కాగా, నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఈ నెల 3వ తేదీని ఖరారు చేశారు. కాగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోటా రామారావు, టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయి నామినేషన్లు దాఖలు చేశారు. ఇక అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. అదే నెల 24న ఫలితాలు వెలువడనున్నాయి.