Telangana New Secretariat Construction: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి

Telangana New Secretariat Construction:  తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి మార్గం క్లీయరైంది. కొత్త సచివాలయ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ...

Telangana New Secretariat Construction: తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి
Follow us
Subhash Goud

|

Updated on: Dec 31, 2020 | 8:17 PM

Telangana New Secretariat Construction:  తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణానికి మార్గం క్లీయరైంది. కొత్త సచివాలయ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమ‌తులు ల‌భించాయి. కాగా, ఇప్పటికే సచివాలయ నిర్మాణానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అత్యాధునిక హంగులతో నూతన సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మించబోతోంది. నిర్మాణానికి ఎలాంటి వాస్తు దోషం లేకుండా, పాలన పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణం జరగాలన్నద ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరిక.

అయితే ఇందుకు సుమారు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ కొత్త సచివాలయ నిర్మాణం 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం కానుంది. దీర్ఘచతురస్రాకారంలో నిర్మాణమయ్యే సచివాలయంలో మంత్రుల షేఫీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్‌ కార్యాలయాలు ఉండేలా నిర్మాణం చేపడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి ప్రవేశించడానికి ప్రత్యేక ద్వారం నిర్మించనున్నారు. మొత్తం 27 ఎకరాల స్థలంలో సచివాలయం కోసం 20 శాతమే వినియోగించనున్నారు.

Also Read:

న్యూ ఇయర్‌ వేడుకల వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు, రేపు ఉదయం 5 గంటల వరకు ఫ్లై ఓవర్ల మూసి వేత

Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…