సురవరం ప్రతాపరెడ్డి అంటే ముందుగా గుర్తొచ్చేది గోల్కొండ పత్రికే అని మంత్రి మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తాను సురవరం సంకలనాల ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నానని తెలిపారు. సురవరం అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి కొనియాడారు. ఆయన జీవితం సంఘర్షణమయమని తెలిపారు. 125 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి గుర్తు చేసుకుంటూ ఉంటే.. ఎంత కాలం జీవించామన్నది కాదు.. ఎలా జీవించామన్నది ముఖ్యం అని కేటీఆర్ సురవరం ప్రతాపరెడ్డిని కొనియాడారు. 125 ఏళ్ల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నామంటే.. సమాజంపై తనదైన ముద్ర వేయడమే అని తెలిపారు. ఈ సందర్భంగా సురవరం కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తోందని అన్నారు. ఈరోజు హెల్త్ యూనివర్సిటీకి కాలోజీ నారాయణరావు పేరు, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ నరసింహారావు, హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ, అగ్రికల్చర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టుకున్నామని వివరించారు. ప్రతాపరెడ్డి పేరును కూడా ఏదో ఒక యూనివర్సిటీకి పెడుతామని ప్రకటించారు.