ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ గడువును పెంచుతూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి చివరి తేదీని నవంబర్ 16 వరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శనివారం పొడిగించింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్-ఎయిడెడ్, కో-ఆపరేటివ్, టిఎస్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టిఎస్ రెసిడెన్షియల్, టిఎస్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, టిఎస్ మోడల్ స్కూల్స్ , కెజిబివి, ప్రోత్సాహక జూనియర్ కాలేజీలు, రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సులు అందిస్తోన్న అన్ని కాంపోజిట్ డిగ్రీ కాలేజీల ప్రధానోపాధ్యాయులు అభ్యర్థుల ప్రవేశాలను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి పొడిగించిన చివరి తేదీ వరకు తీసుకోవచ్చు అని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.
Also Read :
హైదరాబాద్ : భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న 9 చెరువుల వివరాలు
ఆవు పొట్టలో 80 కిలోల ప్లాస్టిక్..