తెలంగాణ ఇంటర్ డిజిటల్ క్లాసులు.. టైమింగ్స్ ఇవే.

|

Aug 30, 2020 | 1:04 AM

కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఆన్లైన్ తరగతుల నిర్వహించనున్నట్లు...

తెలంగాణ ఇంటర్ డిజిటల్ క్లాసులు.. టైమింగ్స్ ఇవే.
Follow us on

Intermediate Online Classes: కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైనా విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఆన్లైన్ తరగతుల నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించగా.. దానికి సంబంధించి తాజాగా షెడ్యూల్ విడుదలైంది.

మార్నింగ్ సెషన్ ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు జరగనుండగా.. మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండనుంది. వారంలో ఆరు రోజులు(సోమ-శని) వరకు దూరదర్శన్ యాదగిరి ఛానెల్‌ ద్వారా విద్యార్ధులకు తరగతులు బోధించానున్నారు. కాగా, ఆన్లైన్ తరగతుల నిర్వహణలో భాగంగా ఉపాధ్యాయులు ఈ నెల 27 నుంచి కాలేజీలకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.