ఎంపీ, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల విషయంలో తాము జోక్యం చేసుకోలేం.. స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు
ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసులపై సత్వర విచారణ జరపాలన్న అంశాన్ని సుప్రీం కోర్టు విచారణ చేపడుతుండగా తాము జోక్యం చేసుకోలేమిన తెలంగాణ హైకోర్టు స్పష్టం..
ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్ కేసులపై సత్వర విచారణ జరపాలన్న అంశాన్ని సుప్రీం కోర్టు విచారణ చేపడుతుండగా తాము జోక్యం చేసుకోలేమిన తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్, సిబ్బందిని నియమించడంతో పాటు సాక్షుల విచారణ ప్రక్రియ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ తరపున న్యాయవాది సత్యంరెడ్డి కోరారు. అయితే సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతున్నందున అక్కడే ప్రస్తావించాలని సూచించిన హైకోర్టు.. పిటిషన్‌పై విచారణను ముగించింది.