ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఈనెల 10 వరకు పొడిగించిన హైకోర్టు, రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చునని వివరణ

|

Dec 08, 2020 | 6:42 PM

ఆస్తుల నమోదు కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై...

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఈనెల 10 వరకు పొడిగించిన హైకోర్టు, రిజిస్ట్రేషన్లు పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చునని వివరణ
Follow us on

ఆస్తుల నమోదు కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై విధించిన స్టేను ఈనెల 10 వరకు పొడిగిస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. ధరణి నిబంధనలకు సంబంధించిన 3 జీవోలపై న్యాయవాది గోపాల్ శర్మ మధ్యంతర పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు స్పందించింది. ధరణి జీవోల పై కౌంటర్లు దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలిచ్చింది. కాగా, వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని ప్రభుత్వం తరపున ఏజీ కోర్టుకు విన్నవించారు. ధరణిపై మధ్యంతర ఉత్తర్వుల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కోర్టు.. రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశించలేదని.. పాత పద్ధతిలో కొనసాగించుకోవచ్చునని సూచించింది. సేకరించిన డేటాకు చట్టబద్ధమైన భద్రత ఉండాల్సిందేనని చెప్పిన హైకోర్టు, ధరణిపై విచారణ ఈ నెల 10కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.