తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.? పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం కేసీఆర్.!

Telangana Government Good News: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల వేతన సవరణ..

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.? పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం కేసీఆర్.!

Updated on: Dec 28, 2020 | 12:09 PM

Telangana Government Good News: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించనుంది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై సీఎం కేసీఆర్ రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫైల్ ఆదివారం ప్రగతి భవన్‌కు చేరింది. ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రకటించడంతో పాటు డిసెంబర్ 31వ తేదీతో ముగుస్తున్న పీఆర్సీ కమిటీ గడువు పొడిగింపుపై కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

అటు వచ్చే ఆర్ధిక సంవత్సరం(2021-22) ప్రారంభం అంటే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త వేతనాలు అందించనున్నట్లు సమాచారం. అలాగే పీఆర్సీ బకాయిల చెల్లింపులపై కూడా సీఎం కేసీఆర్ ముఖ్య ప్రకటన చేసే అవకాశం ఉందట. కాగా, 2018 మేలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కమిటీ గడువును రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సార్లు పొడిగించగా.. చివరిసారిగా గతేడాది ఫిబ్రవరి 18న పొడిగించింది.