Flood Relief Fund: అక్టోబర్ నెలలో భాగ్యనగరంలో కురిసిన వర్షాలకు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు నేటి నుంచి మళ్లీ వరద సయం అందనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఇంటికి రూ. 10 వేల చొప్పున పంపిణీ చేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అయితే ఆ డబ్బు కోసం బాధితులు మీ-సేవ సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తెలిపారు.
వరద సాయం అందని వారి వివరాలను సేకరించేందుకు బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారన్నారు. బాధితుల పేర్లు, ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతాల వివరాలు ధృవీకరించుకుని నేరుగా వారి అకౌంట్లలోకి రూ. 10 వేలు జమ చేస్తామని తెలిపారు. కాగా, ఇప్పటికే 6.64 లక్షల కుటుంబాలకు రూ. 664 కోట్లు అందజేసిన సంగతి తెలిసిందే. GHMC ఎన్నికలతో పంపిణీ మధ్యలో ఆగిపోగా.. ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతోంది.
Also Read: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..