Telangana EAMCET 2020: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల
Telangana EAMCET 2020: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6వరకు.. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా.. రూ. 5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.10వేల […]
Telangana EAMCET 2020: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 21 నుంచి మార్చి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ.500ల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 6వరకు.. రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు అధికారులు వెల్లడించారు.
కాగా.. రూ. 5వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 20 వరకు, రూ.10వేల ఆలస్య రుసుముతో ఏప్రిల్ 27 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులో సవరణలకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు హాల్ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం కల్పించారు. మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్, మే 9, 11 తేదీల్లో ఎంసెట్ వ్యవసాయ, వైద్య పరీక్షలు జరగనున్నాయి.