రంగంలోకి రాములమ్మ

| Edited By: Pardhasaradhi Peri

Oct 16, 2020 | 7:45 PM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి టీఆర్ఎస్ సర్కారు పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. మూడు వరుస ట్వీట్లలో సీఎం కేసీఆర్ పరిపాలనా తీరుతెన్నులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ” వానలు తగ్గినా రోజుల తరబడి కాలనీలకు కాలనీలు నీళ్ళల్లోనే నానుతుండటం… కేసీఆర్ సర్కారు పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పరిపాలనా కాలంలో ఈ పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. టీఆరెస్ అధికారంలోకి రాకముందే ఎన్నెన్నో […]

రంగంలోకి రాములమ్మ
Follow us on

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి టీఆర్ఎస్ సర్కారు పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. మూడు వరుస ట్వీట్లలో సీఎం కేసీఆర్ పరిపాలనా తీరుతెన్నులను ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ” వానలు తగ్గినా రోజుల తరబడి కాలనీలకు కాలనీలు నీళ్ళల్లోనే నానుతుండటం… కేసీఆర్ సర్కారు పాలనా పగ్గాలు అందుకున్న మొదటి, మలి విడతల పరిపాలనా కాలంలో ఈ పరిస్థితుల నుంచి పౌరులను రక్షించేందుకు ఏ పరిష్కారాలు చూపించారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. టీఆరెస్ అధికారంలోకి రాకముందే ఎన్నెన్నో చెరువుల దురాక్రమణ, భూముల కబ్జాలు… అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని కేసీఆర్ పదే పదే అన్నారు. కానీ, జరిగిందేమిటి? మీరైనా ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వెయ్యగలిగారా? మీ నిర్వహణ ఏ తీరున ఉందో జలగండంలో చిక్కుకున్న మీ కలల విశ్వనగరాన్ని చూస్తే చాలు. మొత్తంగా చూస్తే పాలకవర్గం తప్ప మరే వర్గమూ ప్రశాంతంగా లేని పరిస్థితులు నేడు తెలంగాణలో నెలకొన్నాయి. కేసీఆర్ దొరగారు పరిపాలనను అటకెక్కించి టీఆరెస్ గెలుపు కోసం పూర్తిగా దుబ్బాక ఉపఎన్నిక పైనే దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని గ్రహించడం మంచిది.” అంటూ రాములమ్మ టీఆర్ఎస్ సర్కారుపై ప్రశ్నలు కురిపించారు.