కారెక్కుతున్న అజహరుద్దీన్..? ఇంతకీ ఆయన మనసులో ఏముందీ..!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( హెసీఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ అజహరుద్దీన్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే వార్తల్ని ఖండించారు. ఎన్నికల్లో అజహర్ ప్యానెల్ విజయం సాధించిన తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురింపించారు. దీంతో ఆయన గులాబీ గూటికి చేరుతారనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ హెడ్ అందువల్ల ఆయనను కలవాలని అనుకోవడంలో తప్పులేదన్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రభుత్వ […]
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( హెసీఏ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ అజహరుద్దీన్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారనే వార్తల్ని ఖండించారు. ఎన్నికల్లో అజహర్ ప్యానెల్ విజయం సాధించిన తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురింపించారు. దీంతో ఆయన గులాబీ గూటికి చేరుతారనే వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ హెడ్ అందువల్ల ఆయనను కలవాలని అనుకోవడంలో తప్పులేదన్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన తాను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రభుత్వ సహకారాన్ని కోరతానని తెలిపారు. అయితే హెసీఏ ఎన్నికల్లో అజహర్ ప్యానెల్‌కు ఓటు వేయాలని మంత్రి కోరారనే వ్యాఖ్యల్ని కూడా ఆయన నేరుగా స్పందించలేదు. రాజకీయాల కంటే క్రికెట్ అభివృద్ధి కోసం తాను సీఎంతో మాట్లాడాల్సి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తన ప్యానెల్ విజయానికి కృషిచేసిన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం అజహరుద్దీన్ కాంగ్రెస్ నేతగా కొనసాగుతున్నారు.