తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండటంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. ప్రస్తుతం యశోదా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అన్ని రకాల వైద్య పరిక్షలు చేస్తున్నట్టు సమాచారం. కాగా ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అక్కర్లేదని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతున్నారు.