CM KCR Meeting Union Leaders Live Updates : ముగిసిన ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ..పదోన్నతులు త్వరితగతిన చేయిస్తామని హామీ..

|

Dec 31, 2020 | 3:12 PM

ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఏపీలో ఉన్న 850 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతిశాఖలో పదోన్నతులు..

CM KCR Meeting Union Leaders Live Updates : ముగిసిన ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ..పదోన్నతులు త్వరితగతిన చేయిస్తామని హామీ..

CM KCR  : ప్రభుత్వ ఉద్దేశాలేంటి.. ఉద్యోగులకు ఉన్న సమస్యలు ఏంటి.. PRC అమలుపై ఉద్యోగులుకు ఉన్న అభ్యంతరాలేంటి? ఇలాంటి అంశాలపై ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఏపీలో ఉన్న 850 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతిశాఖలో పదోన్నతులు త్వరితగతిన చేయిస్తామన్నారు. జనవరి నెలాఖరులోగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఉద్యోగులతో సీఎం కేసీఆర్ చెప్పారు. జనవరిలో వయోపరిమితి, పీఆర్‌సీ ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. వీటితోపాటు.. మరిన్ని అంశాలపై ఆయన ఉద్యోగులతో చర్చించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Dec 2020 03:07 PM (IST)

    ఉద్యోగ సంఘాలతో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ.. ఏపీ‌లోని తెలంగాణ ఉద్యోగులకు రప్పిస్తాం-సీఎం కేసీఆర్

    ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఏపీలో ఉన్న 850 మంది తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రతిశాఖలో పదోన్నతులు త్వరితగతిన చేయిస్తామన్నారు.

  • 31 Dec 2020 02:56 PM (IST)

    జనవరిలోనే పీఆర్సీ , వయోపరిమితి పెంపు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన..

    గురువారం సాయంత్రం 4 గంటలకు పీఆర్సీ నివేదికను కమిటీ  ప్రభుత్వానికి సమర్పించనుంది. మరో వారం తర్వాత మళ్లీ ఉద్యోగ సంఘాలతో అధికారుల చర్చలు జరుపుతారు. వారం రోజుల్లో  ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న 850 మందిని వారంలోనే స్వరాష్టంలోకి తీసుకరావడానికి ప్రక్రియ మొదలుపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జనవరిలోనే పీఆర్సీ , వయోపరిమితి పెంపు పై ముఖ్యమంత్రి  ఓ ప్రకటన చేయనున్నారు.


  • 31 Dec 2020 02:45 PM (IST)

    పదోన్నది కచ్చితంగా తెలిసేలా క్యాలెండర్..

    ఎప్పుడు పదోన్నది వస్తుందో ఉద్యోగంలో చేరిననాడే కచ్చితంగా తెలిసేలా క్యాలెండర్‌ ఉండాలని సీఎం భావించారు. ఈ మేరకు అన్నీ క్యాలెండర్‌ ప్రకారమే జరిగేలా సర్వీస్‌ రూల్స్‌ సరళతరంగా ఉండేలా కసరత్తు చేసింది.

  • 31 Dec 2020 02:37 PM (IST)

    కొత్త రాష్ట్రంలో కొత్త సర్వీసు రూల్స్‌…

    ఉద్యోగులను స్ట్రీమ్‌లైన్‌ చేయడం, కరవు భత్యం, జీతాలు అలవెన్స్‌లు, ఇంక్రిమెంట్లు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇలా అన్నింటిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించారు. కొత్త రాష్ట్రంలో కొత్త సర్వీసు రూల్స్‌ ఉండాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది.

  • 31 Dec 2020 02:25 PM (IST)

    ఉద్యమ ఆకాంక్షలు ప్రతిఫలించేలా పీఆర్సీ..

    సీఎం కేసీఆర్‌ 2018 మే నెలలో ముగ్గురు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో ఏర్పాటుచేసిన మొదటి పీఆర్సీ కాలపరిమితి గురువారంతో ముగుస్తున్నది. స్వరాష్ట్రంలోనే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆత్మగౌరవంగా బతుకగలుగుతారని భావించి ఉద్యోగులు ఉద్యమించారని, ఆ ఉద్యమ ఆకాంక్షలు ప్రతిఫలించేలా పీఆర్సీ ఉండాలని సీఎం కేసీఆర్‌ భావించారు.

  • 31 Dec 2020 02:04 PM (IST)

    తెలంగాణలో ఏర్పడిన మొదటి పే రివిజన్‌ కమిషన్‌..

    తెలంగాణలో ఏర్పడిన మొదటి పే రివిజన్‌ కమిషన్‌ (PRC) భవిష్యత్‌ మార్గదర్శిగా నిలువనున్నది. సీఎం ఆదేశాల మేరకు ఉద్యోగుల సమస్యలు, ఉద్యమ ఆకాంక్షను నేరవేర్చేలా కమిషన్‌ సుదీర్ఘ కసరత్తు చేసింది. రెండున్నరేండ్లుగా వివిధ అంశాలపై ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు సేకరించి నివేదికను రూపొందించింది. దీనిని నేడో, రేపో ప్రభుత్వానికి అందజేయనున్నది.

  • 31 Dec 2020 01:56 PM (IST)

    పదోన్నతులు, బదిలీలు షెడ్యూల్‌ ప్రకారం జరిగేలా సర్వీస్‌ రూల్స్

    పదోన్నతులు, బదిలీలు షెడ్యూల్‌ ప్రకారం జరిగేలా సర్వీస్‌ రూల్స్‌ రూపొందించాలని నిర్ణయించడం ఉద్యోగులకు ఎంతో వెసులుబాటును కలిగిస్తుంది. ఫిబ్రవరి చివరికల్లా ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాటపై పూర్తి నమ్మకం ఉన్నది.

  • 31 Dec 2020 01:29 PM (IST)

    పదోన్నతులు, బదిలీలు షెడ్యూల్‌ ప్రకారం జరిగేలా సర్వీస్‌ రూల్స్..

    పదోన్నతులు, బదిలీలు షెడ్యూల్‌ ప్రకారం జరిగేలా సర్వీస్‌ రూల్స్‌ రూపొందించాలని నిర్ణయించడం ఎంతో వెసలుబాటు అంటున్నారు ఉద్యోగులు.

  • 31 Dec 2020 01:22 PM (IST)

    ఐదేళ్లకోసారి ఇచ్చే పీఆర్సీని గతంలో రెగ్యులర్‌ ప్రభుత్వోద్యోగులకు మాత్రమే..ఇప్పుడు..

    ఐదేళ్లకోసారి ఇచ్చే పీఆర్సీని గతంలో రెగ్యులర్‌ ప్రభుత్వోద్యోగులకు మాత్రమే ప్రకటించే వారు. కాని కేసీఆర్ మాత్రం అందరూ ఉద్యోగులు ఇస్తున్నారు. ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులతో కలిపి 9 లక్షల 36 వేల 976 మంది వేతనాలు పెరగనున్నాయి.

  • 31 Dec 2020 01:18 PM (IST)

    పీఆర్‌సీ, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఇతర సమస్యలపై మాట్లాడతున్న సీఎం కేసీఆర్..

    పీఆర్‌సీ, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఇతర సమస్యలపై ఉద్యోగులతో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. పీఆర్సీ సహా ఉద్యోగుల సమస్యలన్నీ ఫిబ్రవరి కల్లా పరిష్కారం కావాలని ఇప్పటికే సీఎం.. అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

  • 31 Dec 2020 01:15 PM (IST)

    భేటీకి హాజరయ్యే ఉద్యోగులతో మధ్యాహ్న భోజనం చేయనున్న సీఎం కేసీఆర్

    ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీకి హాజరయ్యే ఉద్యోగులందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. 350 మంది ఉద్యోగులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు.

Follow us on