
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ లో జరిగిన సమావేశానికి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ చట్టాల సవరణ ముసాయిదా బిల్లులకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జీహెచ్‌ఎంసీ చట్టంలో సవరణలు, సీఆర్‌పీసీ సవరణల బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. గ్రేటర్ ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే కొనసాగించడానికే మంత్రివర్గం మొగ్గు చూపింది.