AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో 12 శాతం మందికి కరోనా వచ్చిపోయిందట..!

తెలంగాణలో రెండోసారి ఐసీఎంఆర్ యాంటీబాడీస్ టెస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ప్రజల్లో యాంటీబాడీస్ బాగా పెరిగింది.

తెలంగాణలో 12 శాతం మందికి కరోనా వచ్చిపోయిందట..!
Balaraju Goud
|

Updated on: Oct 02, 2020 | 8:04 AM

Share

తెలంగాణలో రెండోసారి ఐసీఎంఆర్ యాంటీబాడీస్ టెస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ప్రజల్లో యాంటీబాడీస్ బాగా పెరిగింది. 0.5 శాతం నుంచి 18.2 శాతానికి యాంటీబాడీస్ పెరిగినట్లు ఐసీఎంఆర్ నివేదికలో వెల్లడైంది. తెలంగాణలో సగటున 12 శాతం మందికి కరోనా వచ్చిపోయినట్లు నిర్దారించారు. జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 1300 మందికి యాంటీబాడీ టెస్టులు చేశారు. జనగామలో 18 శాతం, కామారెడ్డిలో 6.9శాతం, నల్గొండలో 11.1 శాతం పాజిటివ్ వచ్చింది. కొవిడ్ వ్యాప్తి నెమ్మదిగా జరుగుతుందని ఐసీఎంఆర్‌-ఐఎన్‌ఎన్‌ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం అనేక రాష్ట్రాలు ఆర్టీ- పీసీఆర్ పద్దతిని అవలంబిస్తున్నాయి. వ్యక్తుల నుండి సేకరించిన శాంపిళ్ళలో కరోనా ఉనికిని గుర్తిస్తుంది. దీనినే యాంటిజెన్ పరీక్ష కూడా అంటారు. ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఇది వైరస్ ను గుర్తిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ యాంటీబాడీస్ పరీక్షలు నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం యాంటీ బాడీస్ టెస్టులను నిర్వహించవద్దని ఐసీఎంఆర్ ఇదివరకే ప్రకటన చేసింది.

ప్రతి మనిషిలో రోగ నిరోధక శక్తి ఎంత ఉందో తెలుసుకోవడానికే యాంటీ బాడీ టెస్ట్ నిర్ధారిస్తుంది. భారత్ లో కరోనా ఇప్పటికే 198 రకాలుగా రూపాంతరం చెందినట్టుగా జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జెడ్‌ఎస్‌ఐ) పరిశోధకులు వెల్లడించారు. అందులో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జూన్ నాటికి ఈ వైరస్ 55 రకాలుగా రూపాంతరం చెందిందని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది జనాభాకు కరోనా వచ్చి వెళ్లిన ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఒక హైదరాబాద్ నగరంలోనే 6 లక్షల మంది కరోనా బారిన పడ్డారని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ గతంలోనే వెల్లడించింది.

దాదాపు నగర జనాభాలో 6 శాతం మందికి వైరస్ సోకినట్లు స్పష్టమవుతుంది. కానీ, వీరిలో ఎలాంటి లక్షణాలు లేని వారే అధికంగా ఉన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం గణాంకాల ప్రకారం తెలంగాణాలో నమోదైన కరోనా కేసులు 95,700 మాత్రమే. చాలా మందికి ఇప్పటికే కరోనా వచ్చి ఎలాంటి వైద్యం అవసరం లేకుండానే కరోనా నయమైనట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో యాంటీ బాడీస్ టెస్టులను చేయడం ద్వారా ప్లాస్మా దాతలను కనుగొనవచ్చంటున్నారు నిపుణులు. వారి ద్వారా కరోనా బాధితులకు చికిత్స చేయడం ద్వారా కరోనాను పూర్తిగా నియంత్రించవచ్చంటున్నారు. అలాగే, మనుషుల శరీరంలోకి ఏదైనా విషం చేరినా, కరోనా లాంటి వైరస్, బాక్టీరియా ప్రవేశించినా మన శరీరం 14 రోజుల వ్యవధిలో యాంటీబాడీలను విడుదల చేస్తుంది. వీటిలో మరో రకం యాంటీబాడీస్‌ మాత్రం ఇన్పెక్షన్‌ సోకిన వారం రోజులకు బయటపడుతుంది. ఈ యాంటీబాడీస్ పరీక్షలో పాజిటివ్ గా తేలితే ఆ వ్యక్తికి 15 నుంచి 21 కరోనా వచ్చి వెళ్లినట్టుగా గుర్తిస్తారు. ఇవి శరీరంలో ఉంటే అతనికి మళ్ళీ కరోనా సోకే అవకాశాలు పెద్దగా ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఐసీఎంఆర్ తాజాగి నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడైనట్లు సమాచారం.

Follow Us
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి
ద్రాక్ష పండ్లను కేవలం నీటితో కడిగితే సరిపోదు.. ఇలా శుభ్రం చేయండి