టీవీ9 వేదికగా వైసీపీ, టీడీపీ బహిరంగ చర్చ…

జగన్‌ ఏడాది పాలనపై చర్చకు సిద్దమ‌న్న వైసీపీ నేతల సవాలకు కూడా లోకేష్‌ స్పందించారు. చంద్రబాబు పాలనపై కూడా ప్లేస్‌, డేట్‌ చెబితే చర్చకు వస్తామన్నారు. ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో చర్చ జరిగింది.

టీవీ9 వేదికగా వైసీపీ, టీడీపీ బహిరంగ చర్చ...

Updated on: Jun 08, 2020 | 8:58 PM

జగన్‌ ఏడాది ప్రభుత్వంపై టీడీపీ ఛార్జిషీట్‌ విడుదల చేసింది. ఇందులో భాగంగా జే ట్యాక్స్‌, పథకాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. నవ రత్నాలు అమలు చేస్తామని వైసీపీ నవమోసాలకు పాల్పడిందన్నారు టీడీపీ నేత లోకేష్‌. జగన్‌ ఏడాది పాలనపై చర్చకు సిద్దమ‌న్న వైసీపీ నేతల సవాలకు కూడా లోకేష్‌ స్పందించారు. చంద్రబాబు పాలనపై కూడా ప్లేస్‌, డేట్‌ చెబితే చర్చకు వస్తామన్నారు. ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌లో చర్చ జరిగింది. ఈ డిస్కషన్‌లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి సై అంటే సై అన్నారు. టీవీ9 వేదికను ఏర్పాటు చేస్తే తాము బహిరంగచర్చకు వస్తామన్నారు. ఇందుకు టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజనీకాంత్‌ కూడా బహిరంగ చర్చకు వేదిక‌ను సిద్దం చేస్తామన్నారు. త్వరలోనే రాజధాని అధికార, విపక్షాల మధ్య బహిరంగ చర్చకు వేదిక కానుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us