AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ.. ఆ తర్వాత సీన్ ఏంటంటే?

Ishan Kishan Double Century: దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. సెంచరీని డబుల్ సెంచరీగా మలిచిన అతడు 250 పరుగుల వద్ద గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 27 ఫోర్లు, 7 సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఫైనల్లో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ.. ఆ తర్వాత సీన్ ఏంటంటే?
Tilak Varma, Mohammed Siraj Hound Ishan Kishan With Verbal Exchange
Venkata Chari
|

Updated on: Sep 07, 2026 | 6:02 PM

Share

Ishan Kishan Double Century: చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్‌తో దక్షిణ జోన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. 111 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన అతడు.. చివరకు 250 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు.

సిరాజ్‌తో మాటల తూటాలు..

ఇషాన్ కిషన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తుండగా మహ్మద్ సిరాజ్ బౌన్సర్లతో పరీక్షించాడు. బౌండరీలు బాదిన కిషన్, సిరాజ్ మధ్య మాటల మార్పిడి జరిగింది. ఇద్దరూ ముఖాముఖిగా నిలిచిన సమయంలో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాడు. అయితే ఈ ఘటన స్నేహపూర్వక వాతావరణంలోనే సాగినట్లుగా కనిపించింది.

ఆరంభంలోనే ఈస్ట్ జోన్ దూకుడు..

ఈస్ట్ జోన్ తొలుత వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్‌తో మంచి ఆరంభం అందుకుంది. తొలి వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఈశ్వరన్ 86 బంతుల్లో 72 పరుగులు చేయగా.. సూర్యవంశీ 44 పరుగులు సాధించాడు. అనంతరం శిఖర్ మోహన్ 85 పరుగులతో కీలక సహకారం అందించాడు.

రికార్డుల పుస్తకంలో కిషన్..

250 పరుగులతో ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీ ఫైనల్లో 200కుపైగా స్కోరు చేసిన ఏడో బ్యాటర్‌గా నిలిచాడు. అలాగే ఈస్ట్ జోన్ బ్యాటర్‌గా వృద్ధిమాన్ సాహా 2012లో చేసిన 170 పరుగుల రికార్డును అధిగమించాడు. వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ 2010 ఫైనల్లో చేసిన 183 పరుగుల రికార్డునూ దాటాడు. ఫైనల్లో కెప్టెన్, వికెట్ కీపర్‌గా 200 దాటిన తొలి ఆటగాడిగానూ నిలిచాడు.

620 దాటిన ఈస్ట్ జోన్..

కిషన్ 250 పరుగుల ఇన్నింగ్స్‌లో 27 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. కుమార్ కుశాగ్ర 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101 పరుగులు చేశాడు. అనుకూల్ రాయ్ 45 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 620 పరుగుల మార్కును దాటింది. దక్షిణ జోన్ బౌలర్లలో త్రిపురాన విజయ్, చామ మిలింద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
ఛోటా ప్యాకెట్‌తో సిరాజ్‌ మాటల యుద్ధం.. మధ్యలో తెలుగోడి ఎంట్రీ
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
పారిశుద్ధ్య కార్మికురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!
పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం
పెళ్లి, సంతానం, సొంతింటి కోరికలు నెరవేరుతాయట.. ఈ వరాహస్వామి ఆలయం
కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..
కలెక్టర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. ఫస్ట్ మూవీకే జాతీయ అవార్డ్..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
శాసనసభ గొడవపై తాటా మధు వివరణ..
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!
హాట్ కాఫీ + ప్రోటీన్ పౌడర్.. తాగొచ్చా? అసలు విషయం ఏంటంటే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే!
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
డబ్బు, ఉద్యోగం, వ్యాపారం.. ఈ నక్షత్రాలకు గోల్డెన్ టైమ్ స్టార్ట్
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికలే అసలు పరీక్ష.. టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?
వినాయక చవితి తర్వాత వీరి జాతకం మారడం ఖాయం.. ఏం జరగనున్నదంటే?