కోతముక్కలు.. పేకముక్కలు, అశోక్ గజపతిరాజుని తప్పించిన సీఎం.. తిరుమల ఘటనలపై వై.వీ.సుబ్బారెడ్డిని తొలగించగలరా? :ఉమ

|

Jan 03, 2021 | 5:01 PM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరంజిల్లా రామతీర్థం పర్యటనతో ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని టీడీపీ సీనియర్ నేత,..

కోతముక్కలు.. పేకముక్కలు, అశోక్ గజపతిరాజుని తప్పించిన సీఎం.. తిరుమల ఘటనలపై వై.వీ.సుబ్బారెడ్డిని తొలగించగలరా? :ఉమ
Follow us on

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరంజిల్లా రామతీర్థం పర్యటనతో ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై, ప్రజల్లో వ్యతిరేకత రావడంతో దాన్నుంచి వారి దృష్టి మళ్లించడానికే ముఖ్యమంత్రి, మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నాడని ఆయన విమర్శించారు. రామతీర్థం ఘటన జరిగిన తరువాతిరోజు విజయనగరం వెళ్లిన ముఖ్యమంత్రి అప్పుడే ఘటనపై ఎందుకు నోరెత్తలేదు? అని ఆయన ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి ఇప్పటివరకు రామతీర్థం వెళ్లకుండా ఏం చేస్తున్నారని ఆయన అడిగారు..

రామతీర్థం ఘటనను సాకుగా చూపి అశోక్ గజపతిరాజుని తప్పించిన ముఖ్యమంత్రి, తిరుమల ఘటనలకు బాధ్యుడిని చేస్తూ వై.వీ.సుబ్బారెడ్డిని తప్పించగలడా? అని ఛాలెంజ్ విసిరారు. నార్కో ఎనాలసిస్ పరీక్షలు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికని కొడాలి నాని గ్రహిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. గుడివాడలో కోతముక్కలు, పేకముక్కలు ఆడిస్తున్న నాని, రైతులకు రూ.2,209 కోట్లు ఎప్పుడు చెల్లిస్తాడో చెప్పాలి? అని ఆయన డిమాండ్ చేశారు. బీటెక్ రవి అరెస్ట్ ప్రభుత్వ పెత్తందారీ విధానానికి సంకేతమని దేవినేని ఉమ అన్నారు.