ప్రత్యేక హోదా(Special Status) పై యుద్ధం చేయకుండా ముఖ్యమంత్రి జగన్(CM Jagan) కు పలాయనవాదమెందుకని తెలుగుదేశం అధినేత చంద్రబాబు(TDP president Chandrababu) ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ నాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అజెండాలో హోదా మా ఘనతే అని చెప్పి, ఇప్పుడు మాపై బురద వేస్తారా అని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం తగ్గకపోయినా, ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆక్షేపించారు. ఈశాన్య రాష్ట్రాలకంటే దారుణంగా ఏపీని దిగజార్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేని సమస్యను సృష్టించి సినిమా హీరోలను సీఎం జగన్ తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవి లాంటి వారు జగన్ వద్ద ప్రాధేయపడాలా అని సూటిగా ప్రశ్నించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమను కించపరిచారని ఆక్షేపించారు.
గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చెయ్యడమే నాడు నేడు పథకం ముఖ్య ఉద్దశ్యమా అని చంద్రబాబు ప్రశ్నించారు. పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైసీపీ అవినీతిపై టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. కరెంట్ సరఫరా లేనప్పటికీ.. అధిక కరెంట్ బిల్లులు వస్తున్నాయని, విశాఖ ఉక్కుపై ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపును నిలిపి వేయాలన్నారు.
లేని సమస్యను సృష్టించి జగన్ సినిమా హీరోలను ఘోరంగా అవమానించారు. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్ను ప్రాధేయపడాలా…? ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమను కించపరిచారు. గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చేశారు. పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైసీపీ అవినీతిపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోయినా.. అధిక బిల్లులు వస్తున్నాయి. విశాఖ ఉక్కుపై ఎందుకు మాట్లాడడం లేదు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలి.
– చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడు