టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత..!

టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్‌కు వెళ్తున్న సమయంలో బీపీ తగ్గిపోవడంతో ఆయన ఆకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో.. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వెంటనే డాక్టర్‌కి సమాచారం ఇవ్వగా ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా.. గరికపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మోదీ, అమిత్‌షాలతో భేటీ […]

టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత..!

Edited By:

Updated on: Jun 20, 2019 | 5:16 PM

టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్‌కు వెళ్తున్న సమయంలో బీపీ తగ్గిపోవడంతో ఆయన ఆకస్మాత్తుగా కింద పడిపోయారు. దీంతో.. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ వెంటనే డాక్టర్‌కి సమాచారం ఇవ్వగా ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కాగా.. గరికపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్‌లు టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మోదీ, అమిత్‌షాలతో భేటీ అయ్యారు. ఇందుకు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us