మోడీ కాలకేయుడు.. చంద్రబాబు బాహుబలి: నారా లోకేష్

మోదీ బాహుబలి కామెంట్స్‌పై టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎత్తేసి.. దండయాత్ర చేస్తున్న కాలకేయుడు మోదీ అంటూ ధ్వజమెత్తారు లోకేష్. ‘‘కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాకపోయినా.. ఆంధ్రులను తలెత్తుకుని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి’’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అలాగే.. మోదీ హెరిటేజ్ కామెంట్స్ పైనా ట్వీట్ చేశారు లోకేష్. ‘‘ఏపీ హెరిటేజ్‌ను చూసుకునేందుకు చంద్రబాబు.. హెరిటేజ్ సంస్థకు బ్రాహ్మణి, భువనేశ్వరిలున్నారన్నారు’’ […]

మోడీ కాలకేయుడు.. చంద్రబాబు బాహుబలి: నారా లోకేష్

Edited By:

Updated on: Apr 02, 2019 | 4:47 PM

మోదీ బాహుబలి కామెంట్స్‌పై టీడీపీ మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎత్తేసి.. దండయాత్ర చేస్తున్న కాలకేయుడు మోదీ అంటూ ధ్వజమెత్తారు లోకేష్. ‘‘కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా రాకపోయినా.. ఆంధ్రులను తలెత్తుకుని నిలబడేలా చేసిన బాహుబలి మా ముఖ్యమంత్రి’’ అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

అలాగే.. మోదీ హెరిటేజ్ కామెంట్స్ పైనా ట్వీట్ చేశారు లోకేష్. ‘‘ఏపీ హెరిటేజ్‌ను చూసుకునేందుకు చంద్రబాబు.. హెరిటేజ్ సంస్థకు బ్రాహ్మణి, భువనేశ్వరిలున్నారన్నారు’’ లోకేష్. జగన్ అక్రమాస్తుల హెరిటేజ్‌కి మోదీ చౌకీదార్‌గా మారారంటూ ట్వీట్లో విమర్శల వర్షం కురిపించారు.