విశాఖ ఘటనలపై.. గవర్నర్‌కు.. టీడీపీ నేతలు కంప్లయింట్‌

విశాఖ ఘటనలపై తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేయబోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ నేతలు గవర్నర్‌ హరిచందన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. పర్యటనకు అనుమతి ఇచ్చి కూడా చంద్రబాబును వెనక్కి పంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్యయాత్ర చేపడతామంటూ స్పష్టం చేశారు. మరోవైపు విశాఖలో జరిగిన సంఘటనలపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు టూర్‌కు అనుమతిని ఇచ్చిన పోలీసులు వైసీపీ కార్యకర్తలను నిలువరించడంలో విఫలం చెందారని […]

విశాఖ ఘటనలపై.. గవర్నర్‌కు.. టీడీపీ నేతలు కంప్లయింట్‌

Edited By:

Updated on: Feb 28, 2020 | 4:03 PM

విశాఖ ఘటనలపై తెలుగుదేశం పార్టీ గవర్నర్‌కు ఫిర్యాదు చేయబోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ నేతలు గవర్నర్‌ హరిచందన్‌ అపాయింట్‌మెంట్‌ కోరారు. పర్యటనకు అనుమతి ఇచ్చి కూడా చంద్రబాబును వెనక్కి పంపేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్యయాత్ర చేపడతామంటూ స్పష్టం చేశారు. మరోవైపు విశాఖలో జరిగిన సంఘటనలపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు టీడీపీ నేతలు. చంద్రబాబు టూర్‌కు అనుమతిని ఇచ్చిన పోలీసులు వైసీపీ కార్యకర్తలను నిలువరించడంలో విఫలం చెందారని వారు పేర్కొన్నారు.