‘మనందరికీ కావల్సింది అదేగా.. జగన్ గారూ..’

కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు ఈ ఏడాది ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏపీకి ఫస్ట్ ప్లేస్ రావడం ముమ్మాటికీ టీడీపీ ఘనతేనంటున్నారు ఆపార్టీ నేత గల్లా జయదేవ్. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకింగ్స్ లో వరుసగా నాలుగోసారీ..

మనందరికీ కావల్సింది అదేగా.. జగన్ గారూ..

Updated on: Sep 06, 2020 | 3:44 PM

కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు ఈ ఏడాది ప్రకటించిన ర్యాంకింగ్స్ లో ఏపీకి ఫస్ట్ ప్లేస్ రావడం ముమ్మాటికీ టీడీపీ ఘనతేనంటున్నారు ఆపార్టీ నేత గల్లా జయదేవ్. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్ లో వరుసగా నాలుగోసారీ ఏపీకి ఫస్ట్ ప్లేస్ రావడం గత ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరించిన విధానాలే కారణమంటున్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించడం ఎంతో సంతోషాన్నిస్తుందంటూ వరుస ట్వీట్లలో హర్షం వ్యక్తం చేశారు. నూతన సంస్కరణలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎంత ప్రగతిశీలకంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇది స్పష్టమైన నిదర్శనం అని గల్లా తెలిపారు. ఏపీ ఇవాళ ఈ గొప్పదనం సాధించిందంటే అందుకు కారణం టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని స్పష్టం చేశారు. పెట్టుబడులకు గమ్యస్థానంలా రాష్ట్రాన్ని మలిచినందుకు లభించిన ప్రతిఫలం ఇదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ సర్కారు ఈ ఆధిక్యతను చేజారనీయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదేమైనా, మనం అందరం కోరుకునేది రాష్ట్రం శక్తిమంతం కావాలని.. ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలు అందుకోవాలనేనని గల్లా జయదేవ్ చెప్పుకొచ్చారు.

Loading...
Unable to load recommendations.
Follow Us