డిజిపికి చంద్రబాబు రాసిన లేఖలో ఏమున్నదంటే..

|

Oct 05, 2020 | 10:51 AM

ఎపి డిజిపి గౌతం సవాంగ్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రాధమిక హక్కులు కాలరాయడం.. వాటిపై కనీస చర్యలు లేకపోవడం.. దేశంలోని పోలీసులపై వ్యక్తిగత కేసులు నమోదైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం.. ఈ అప్రతిష్టను తొలగించేందుకు ప్రయత్నించే క్రమం.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడం గురించి చంద్రబాబు తన లేఖలో డిజిపికి పలు అంశాలు విన్నవించారు. ‘శాంతిభద్రతలు క్షీణించడం, ప్రాధమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ […]

డిజిపికి చంద్రబాబు రాసిన లేఖలో ఏమున్నదంటే..
Follow us on

ఎపి డిజిపి గౌతం సవాంగ్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రాధమిక హక్కులు కాలరాయడం.. వాటిపై కనీస చర్యలు లేకపోవడం.. దేశంలోని పోలీసులపై వ్యక్తిగత కేసులు నమోదైన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటం.. ఈ అప్రతిష్టను తొలగించేందుకు ప్రయత్నించే క్రమం.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడం, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించడం గురించి చంద్రబాబు తన లేఖలో డిజిపికి పలు అంశాలు విన్నవించారు.

‘శాంతిభద్రతలు క్షీణించడం, ప్రాధమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడటం వంటి అనేక దుర్ఘటనలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారింది. ఈ విధమైన అప్రజాస్వామిక చర్యల గురించి మీ దృష్టికి తెచ్చి వాటిపై సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం ప్రతిపక్ష నాయకుడిగా నాపై ఉన్నాయి. వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించినవారిని వెంటాడటం, అర్ధరాత్రి అరెస్ట్ లు, హింసాత్మక దాడులు, ఆస్తుల విధ్వంసం, బెదిరింపులు, దుర్భాషలు, అసభ్య ప్రచారం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం జరుగుతోంది.. అంటూ చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. లేఖ పూర్తి పాఠం ఈ దిగువన..

 

file:///C:/Users/website.TV9ABCPL/Desktop/CBN%20Lr%20to%20DGP_05.10.2020.pdf