ఆ హీరోయిన్‌తో నాకు సంబంధం లేదు : మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ

ఏపీ టీడీపీ నేత, విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు చుక్కెదురైంది. తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ హోటల్ నుంచి హీరోయిన్ తో బయటకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది ప్రత్యర్థి వ్యక్తులు తనపై ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలతో ప్రజల్లో తనపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతాయని చెప్పారు. […]

ఆ హీరోయిన్‌తో నాకు సంబంధం లేదు : మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ

Updated on: Oct 15, 2020 | 3:34 PM

ఏపీ టీడీపీ నేత, విజయవాడ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమకు చుక్కెదురైంది. తనపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయన హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ హోటల్ నుంచి హీరోయిన్ తో బయటకు వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారని ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది ప్రత్యర్థి వ్యక్తులు తనపై ఫేస్ బుక్ , ట్విట్టర్ వంటి మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలతో ప్రజల్లో తనపై లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతాయని చెప్పారు. ఆ హీరోయిన్ ఎవరో తనకు తెలియదని.. అమెతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, బొండా ఉమ ఫిర్యాదును గోల్కొండ పోలీసులు తిరస్కరించారు. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవాలని బోండా ఉమకు సూచించడంతో ఆయన వెనుదిరిగారు.