పచ్చపార్టీకి మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై?

|

Jun 20, 2019 | 3:11 PM

తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల నేపధ్యంలో తాజాగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా  వారి బాటలోనే వెళ్లాలని  నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనికి ఊతమిచ్చేలా కాకినాడలో ఆపార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా ఒక హోటల్లో సమావేశమైనట్టుగా సమాచారం. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో వీరంతా భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు […]

పచ్చపార్టీకి మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై?
Follow us on

తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల నేపధ్యంలో తాజాగా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా  వారి బాటలోనే వెళ్లాలని  నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి.

దీనికి ఊతమిచ్చేలా కాకినాడలో ఆపార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు రహస్యంగా ఒక హోటల్లో సమావేశమైనట్టుగా సమాచారం. రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో వీరంతా భేటీ అయి తాజా పరిస్థితులపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరోవైపు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా  విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో వీరంతా రహస్యంగా సమావేశం కావడం చర్చనీయాంశమైంది. అయితే వీరంతా పార్టీ మారడంపైనే చర్చిస్తున్నట్టుగా సమాచారం.

ఈ రహస్య భేటీలో మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్,బొండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగల్రాయుడు, బండారు మాధవనాయుడు, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు పాల్గొన్నారు.  ఇదిలా ఉంటే తాము పార్టీ మారే ప్రశ్నలేదని తోట త్రిమూర్తులు, జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు.