నేను ఆ మాటంటే.. తల ఎక్కడ పెట్టుకుంటారు..?

| Edited By:

Jul 25, 2019 | 8:32 PM

ఏపీ సీఎం జగన్ వెర్సస్ చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ వేదికగా ఇరువురు నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే గురువారం సాగునీటి పంపకాలపై జరిగిన చర్చలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చ రాజేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్ధాయిలోని వ్యక్తి సభలో నోటికొచ్చినట్టు మాట్లాడితే సరికాదని హెచ్చరించారు ప్రతిపక్షనేత చంద్రబాబు. నీటిపంపకాలపై చర్చ సమయంలో సీఎం జగన్ మాట్లాడుతుండగా చంద్రబాబు పైకి లేచారు. ఆ సమయంలో అసహనానికి గురైన […]

నేను ఆ మాటంటే.. తల ఎక్కడ పెట్టుకుంటారు..?
Follow us on

ఏపీ సీఎం జగన్ వెర్సస్ చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీ వేదికగా ఇరువురు నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. అయితే గురువారం సాగునీటి పంపకాలపై జరిగిన చర్చలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చ రాజేస్తున్నాయి. ముఖ్యమంత్రి స్ధాయిలోని వ్యక్తి సభలో నోటికొచ్చినట్టు మాట్లాడితే సరికాదని హెచ్చరించారు ప్రతిపక్షనేత చంద్రబాబు.

నీటిపంపకాలపై చర్చ సమయంలో సీఎం జగన్ మాట్లాడుతుండగా చంద్రబాబు పైకి లేచారు. ఆ సమయంలో అసహనానికి గురైన జగన్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ వేశారు. ఇదే విషయంపై చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ జగన్ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. భాషను కంట్రోల్ చేసుకోవాలి. నోరు పారేసుకుంటే హుందాతనం రాదు. నేను కూడా ఒక్క నిమిషంలో ఆ మాట అనగలను, నేను ఆ మాటంటే జగన్ తల ఎక్కడ పెట్టుకుంటాడు? గతంలో రాజశేఖర్‌రెడ్డి, చెన్నారెడ్డి లాంటి వారు ఇలాగే మాట్లాడితే వార్నింగ్ ఇచ్చాను .. ఇప్పుడు జగన్‌కి కూడా ఇస్తున్నా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదే చర్చలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ప్రశంసించడంపై కూడా చంద్రబాబు అభ్యంతరం పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో వైసీపీకి డబ్బులిచ్చారు కదా అని ఆంధ్రప్రదేశ్‌ను కేసీఆర్‌కు ధారాదత్తం చేస్తారా అని ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలంటే కోస్తా నుంచి తెలంగాణకు నీరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ పర్మినెంట్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు.