ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రథం అగ్నికి ఆహుతైన అంశం తీవ్ర రూపం దాల్చుతోంది. కేవలం రాజకీయ వర్గాల్లోనే కాకుండా ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఆధ్మాత్మిక వేత్తలు స్పందిస్తున్నారు. కాగా, ఈ ఘటనలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో నిమ్మకాయల చినరాజప్ప, గొల్లపల్లి సూర్యారావు సభ్యులుగా ఉంటారు. వీరిద్దరూ అంతర్వేదిలో రథం దగ్ధమైన ప్రాంతాన్ని సందర్శించి చంద్రబాబుకు నివేదిక అందించనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ కూడా ఈ ఘటనను తీవ్రమైన అంశంగా పరిగణించింది. ’62 సంవత్సరాల చరిత్ర కలిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం ఉన్నట్టుండి గత రాత్రి మంటలు అంటుకుని దగ్ధమవటం అనేక అనుమానాలకు తావిస్తోంది’. అంటూ వ్యాఖ్యానిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది.
62 సంవత్సరాల చరిత్ర కలిగిన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి రథం ఉన్నట్టుండి గత రాత్రి మంటలు అంటుకుని దగ్ధమవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. pic.twitter.com/lPM8OQFn2x
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) September 6, 2020