దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు, రోజువారీ రికవరీలు దాదాపు సమానంగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతుంది. తమిళనాడులో వైరస్ బారిన పడుతున్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,395 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,391కి చేరింది. అందులో సోమవారం వైరస్ బారి నుంచి కోలుకున్న 5,572 మందితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 5,69,664కు పెరిగింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్యలో పెద్దగా హెచ్చుతగ్గులు లేకుండా 45,881గా నమోదైంది. ఇక, సోమవారం కొత్తగా 62 మంది కరోనా బాధితులు మృతిచెందడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 9,846కు చేరుకుందని తమిళనాడు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.