గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి.. మొక్కలు నాటారు త‌మిళ్ స్టార్‌ హీరో విజ‌య్ సేతుప‌తి. ప్ర‌స్తుతం 'ఉప్పెన' సినిమాలో “తమిళ్ మక్కల్ సెల్వన్ " విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి..

Edited By:

Updated on: Jul 27, 2020 | 1:30 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి.. మొక్కలు నాటారు త‌మిళ్ స్టార్‌ హీరో విజ‌య్ సేతుప‌తి. ప్ర‌స్తుతం ‘ఉప్పెన’ సినిమాలో “తమిళ్ మక్కల్ సెల్వన్ ” విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటించారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు సాన ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు విజయ్ సేతుపతి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టార‌న్నారు. వాతావరణ కాలుష్యం తగ్గడం కోసం మొక్కలు నాటి ఇస్తున్నారన్నారు. అందులో భాగంగా నేను కూడా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఉప్పెన సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపారు. మా లాగే అభిమానులు కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు విజ‌య్ సేతుప‌తి.

Read More:

సీనియ‌ర్ నిర్మాత క‌న్నుమూత‌..

భార‌త్ క‌రోనా తీవ్ర‌త‌రం.. 14 ల‌క్ష‌లు దాటేసిన కేసులు..

ఇబ్ర‌హీంప‌ట్నం మాజీ ఎమ్మెల్యే మృతి