కోర్టు మెట్లెక్కిన హీరో విశాల్

సినీనటుడు విశాల్ సర్వీస్ ట్యాక్స్ చెల్లించని కారణంగా ఎగ్మూర్ ఆదాయ నేరాల విచారణ న్యాయస్థానంలో హాజరయ్యారు. నటుడు విశాల్ రూ. కోటి వరకూ సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని ఆదాయపన్ను శాఖ 2016 నుంచి 2018 వరకు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే అయినా విశాల్‌ ఒక్కసారి కూడా నేరుగా హాజరు కాలేదు. ఆయన తరపున ఆడిటర్‌ మాత్రమే హాజరయ్యారు. ఇందువల్ల ఆదాయపన్ను శాఖ విచారణకు నేరుగా హాజరు కావాలని చెన్నై ఎగ్మూర్‌ కోర్డులో కేసు దాఖలు […]

కోర్టు మెట్లెక్కిన హీరో విశాల్

Edited By:

Updated on: Jul 03, 2019 | 12:26 PM

సినీనటుడు విశాల్ సర్వీస్ ట్యాక్స్ చెల్లించని కారణంగా ఎగ్మూర్ ఆదాయ నేరాల విచారణ న్యాయస్థానంలో హాజరయ్యారు. నటుడు విశాల్ రూ. కోటి వరకూ సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని ఆదాయపన్ను శాఖ 2016 నుంచి 2018 వరకు ఐదుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే అయినా విశాల్‌ ఒక్కసారి కూడా నేరుగా హాజరు కాలేదు. ఆయన తరపున ఆడిటర్‌ మాత్రమే హాజరయ్యారు. ఇందువల్ల ఆదాయపన్ను శాఖ విచారణకు నేరుగా హాజరు కావాలని చెన్నై ఎగ్మూర్‌ కోర్డులో కేసు దాఖలు చేసింది. దీంతో ఆయన ఈరోజు కోర్టుకు రావాల్సి వచ్చింది. ఇరుతరపు వాదనలు విన్న అనంతరం ఈ కేసు విచారణను ఆగష్టు 1వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.