AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరమ్మాయిల పెళ్లి.. వారణాసిలో వింత

ఓ యువతి మరో యువతిని పెళ్లాడిన ఘటన యూపీలోని వారణాసిలో జరిగింది. సుందర్ పూర్, కాన్పూర్ లకు చెందిన ఇద్దరు యువతులు రొహనియా ప్రాంతంలోని ఓ శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఆలయానికి ఆటోలో వచ్చిన ఈ ఇద్దరు యువతులు వివాహం జరిగాక, తిరిగి అదే ఆటోలో వెళ్లిపోయారు. అక్కడున్న వారంతా ఈ తంతును చూసి ఆశ్చర్యపోయారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఈ ఇద్దరు యువతులు […]

ఇద్దరమ్మాయిల పెళ్లి.. వారణాసిలో వింత
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2019 | 4:32 PM

Share

ఓ యువతి మరో యువతిని పెళ్లాడిన ఘటన యూపీలోని వారణాసిలో జరిగింది. సుందర్ పూర్, కాన్పూర్ లకు చెందిన ఇద్దరు యువతులు రొహనియా ప్రాంతంలోని ఓ శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఆలయానికి ఆటోలో వచ్చిన ఈ ఇద్దరు యువతులు వివాహం జరిగాక, తిరిగి అదే ఆటోలో వెళ్లిపోయారు. అక్కడున్న వారంతా ఈ తంతును చూసి ఆశ్చర్యపోయారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జీన్స్, టీషర్ట్ వేసుకున్న ఈ ఇద్దరు యువతులు రొహనియా ప్రాంతంలోని ఒక శివాలయానికి చేరుకున్నారు. చాలాసేపు వారిద్దరూ అక్కడే కూర్చున్నారు. తరువాత తమ దగ్గరున్న చున్నీలను కప్పుకుని అక్కడున్న పూజారి దగ్గరకు వెళ్ళి పెళ్లి చేయాలని అడిగారు. దీనికి మొదట అతను నిరాకరించినా, తరువాత పూజారి అందుకు ఒప్పుకున్నారు. పెళ్లి తంతులోని కార్యక్రమాలన్నింటినీ వధూవరుల మాదిరిగా పూర్తిచేశారు. ఒక యువతి మరో యువతికి మంగళసూత్రం కూడా కట్టింది. పూలమాలలు కూడా వేసుకున్నారు. పెళ్లి అనంతరం వారు పూజారికి దక్షిణ కూడా సమర్పించుకున్నారు. వీరి వివాహ తంతును చూసిన వారు ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Follow Us