Tamannaaah Drives Bus: అందాల తార బస్సు ఎలా నడిపిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..

|

Dec 31, 2020 | 4:09 PM

Tamannaah Insta Video Viral ‘సీటీమార్’ చిత్రంతో బిజీగా ఉన్న తమన్నా.. షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఓ వీడియోను..

Tamannaaah Drives Bus: అందాల తార బస్సు ఎలా నడిపిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..
Tamannaah
Follow us on

Tamannaah Insta Video Viral: అందం, అభినయం కలగలిసిన నటీమణుల్లో నటీమణి తమన్నా ఒకరు. మంచు మనోజ్ హీరోగా నటించిన ‘శ్రీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల భామ తర్వాత అనతికాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంటూ దూసుకెళ్లింది. టాలీవుడ్‌ల్లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన ఆడిపాడిన ఈ చిన్నది ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తన మొక్కవోని ధీక్షతో కొద్ది సమయంలోనే కరోనాను జయించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సీటీమార్’ చిత్రంతో బిజీగా ఉన్న తమన్నా.. షూటింగ్ స్పాట్‌కు సంబంధించిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తమన్నా బస్సు నడుపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన ఆమె అభిమానులు తమన్నా డేరింగ్‌కు శభాష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం తమన్నా.. ‘సీటీమార్’తో పాటు ‘ఎఫ్3’ చిత్రాల్లో నటిస్తోంది.

తమన్నా బస్సు నడుపుతోన్న వీడియో…

Also Read: అభిమానులకు దొరికిపోయిన బాలీవుడ్ రహస్య ప్రేమికులు.. ఎలాగో దొరికిపోయాం కదా అని ఏం చేశారంటే?