‘సరిలేరు’.. ఈవెంట్‌.. ఫ్యాన్స్‌కు మిల్కీ బ్యూటీ డబుల్ బొనాంజా!

|

Jan 07, 2020 | 5:33 PM

ఒకే వేదికపై సూపర్ స్టార్, మెగాస్టార్ కలిస్తే ఎలా ఉంటుంది.. వినడానికే ఊహ అదిరిపోయింది కదూ.. అదే నిజమైతే మరి.. అవునండీ.. ఈ రోజు జరగబోయే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌.బి స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మెగా సూపర్ ఈవెంట్‌లో […]

సరిలేరు.. ఈవెంట్‌.. ఫ్యాన్స్‌కు మిల్కీ బ్యూటీ డబుల్ బొనాంజా!
Follow us on

ఒకే వేదికపై సూపర్ స్టార్, మెగాస్టార్ కలిస్తే ఎలా ఉంటుంది.. వినడానికే ఊహ అదిరిపోయింది కదూ.. అదే నిజమైతే మరి.. అవునండీ.. ఈ రోజు జరగబోయే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌.బి స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మెగా సూపర్ ఈవెంట్‌లో స్పెషల్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఇక అది హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ప్రోమోలు, లుక్స్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్ అయితే ఏకంగా యూట్యూబ్ రికార్డులను బద్దలుకొట్టాయి. పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు. విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, సంగీత తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, జనవరి 11న సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.