తెలుగు విలువ వైసీపీకి తెలుసా? : పవన్

|

Nov 11, 2019 | 5:23 AM

గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియంలో బోధనలు జరపాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలవురు సాహితివేత్తలు, తెలుగు పండితులు, నిపుణుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీషును ప్రవేశపెట్టాలని..విద్యాశాఖ అధికారులకు సీఎం సవరణను సూచించారు. అయినప్పటికి విమర్శలు తగ్గడం లేదు. తాజాగా ఈ ఇష్యూపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు […]

తెలుగు విలువ వైసీపీకి తెలుసా? : పవన్
Follow us on

గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీషు మీడియంలో బోధనలు జరపాలని జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై పలవురు సాహితివేత్తలు, తెలుగు పండితులు, నిపుణుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 1 నుంచి 6వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీషును ప్రవేశపెట్టాలని..విద్యాశాఖ అధికారులకు సీఎం సవరణను సూచించారు. అయినప్పటికి విమర్శలు తగ్గడం లేదు.

తాజాగా ఈ ఇష్యూపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ప్రయత్నం చేస్తుంటే..అధికార భాషాసంఘం ఏం చేస్తుందని ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు గుప్పించారు.

భాషను, సంస్కృతిని ఎలా రక్షించుకోవాలో పక్క రాష్ట్రం సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలని పవన్..జగన్‌కు సూచించారు. ఈ సందర్భంగా 2017లో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ రూపొందించిన ‘తొలిపొద్దు’ పుస్తకాన్ని పవన్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.

వైసీపీ నాయకత్వం తెలుగు భాష యెక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోగల్గితే..ఇటువంటి అర్థరహితమైన నిర్ణయం తీసుకునేవారు కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘అమ్మభాష’ ప్రాముఖ్యతను వివరిస్తూ రాసిన వ్యాసాన్ని ఆయన ట్విట్టర్‌లో ఫోస్ట్ చేశారు. ఆ వ్యాసం వైసీపీ ప్రభుత్వానికి కళ్లు తెరిపించేదిలా ఉందని పవన్ పేర్కొన్నారు.