తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

| Edited By:

Jul 31, 2020 | 1:13 PM

తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుయి గురువారం నాడు కన్నుమూశారు. రాత్రి 7.24 గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచినట్లు తైపై వెటరన్ జనరల్ ఆస్పత్రి వెల్లడించింది.ఆయన వయస్సు 97 ఏళ్లు. గత కొద్ది..

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు
Follow us on

తైవాన్ మాజీ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుయి గురువారం నాడు కన్నుమూశారు. రాత్రి 7.24 గంటల సమయంలో ఆయన ప్రాణాలు విడిచినట్లు తైపై వెటరన్ జనరల్ ఆస్పత్రి వెల్లడించింది.ఆయన వయస్సు 97 ఏళ్లు. గత కొద్ది రోజులుగా హృద్రోగ సంబంధ సమస్యలతో పాటుగా.. అవయవాలు కూడా సరిగ్గా పని చేయకపోవడంతో గత ఫిబ్రవరిలోనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి ఆయన తైపే వెటరన్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లోనే ఉన్నారు. తైవాన్‌కు చైనాకు సంబంధం లేకుండా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు.. తైవాన్‌ దేశానికి స్వాతంత్ర్యం కావాలని ఆకాంక్షించారు.

 

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే