సుశాంత్ ఇంటికి చేరిన సీబీఐ బృందం
సుశాంత్ కేసు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ అధికారులు శనివారం కూడా అతని ఇంటి వంటమనిషిని ప్రశ్నించారు. నగరంలోని డీఆర్ డీ ఓ కార్యాలయానికి అతడిని పిలిపించి సుశాంత్ సూసైడ్ రోజున..

సుశాంత్ కేసు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ అధికారులు శనివారం కూడా అతని ఇంటి వంటమనిషిని ప్రశ్నించారు. నగరంలోని డీఆర్ డీ ఓ కార్యాలయానికి అతడిని పిలిపించి సుశాంత్ సూసైడ్ రోజున అతడు ఎక్కడ ఉన్నాడు, ఏంచేస్తున్నాడనే వివరాలు సేకరించారు. అలాగే సుశాంత్ మాజీ మేనేజరుగా చెప్పుకుంటున్న నటుడు సిధ్ధార్త్ పితానిని కూడా వారు విచారించారు. మనీ లాండరింగ్ కేసులో ఇతడిని ఈడీ సిబ్బంది ఇదివరకే ఇంటరాగేట్ చేశారు. కాగా సుశాంత్ స్నేహితుల్లో మరికొందరిని సైతం వారు ప్రశ్నించనున్నారు. అయితే ఇప్పటివరకు వారు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారిస్తారా అన్న విషయం తేలలేదు. మరోవైపు సుశాంత్ ఆటాప్సీ రిపోర్టును అధ్యయనం చేసేందుకు ఢిల్లీ ఎయిమ్స్ లో ఫోరెన్సిక్ విభాగానికి చెందిన నలుగురు నిపుణులు వచ్ఛేవారం ముంబైని విజిట్ చేయనున్నారు. వీరు సోమవారం ఈ నగరానికి చేరవచ్చు.
ఈ నిపుణులు కూడా ఈ కేసులో సీబీఐతో కలిసి సమన్వయం గా పని చేయవచ్ఛునని తెలుస్తోంది.



