Surya Will Act In Straight Telugu Movie: పేరుకు తమిళ హీరో అయినా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నటుడు సూర్య. తనదైన నటనతో, కథల ఎంపికతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక సూర్య సినిమా వస్తుందంటే తెలుగులోనూ మంచి అంచనాలు ఉంటాయి. ఇటీవలే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నాడీ యంగ్. నిజానికి ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం థియేటర్లోనూ మంచి విజయాన్ని నమోదు చేసింది.
ఇదిలా ఉంటే ఇదే విజయాన్ని కొనసాగించాలని చూస్తోన్న సూర్య దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసిన సూర్య ఈసారి నేరుగా తెలుగులోనే నటించనున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ చేయనున్నాడనేది సదరు వార్త సారాంశం. సాధారణంగానే మాస్ సినిమాల్లో తనదైన శైలిలో నటించే సూర్య మాస్ సినిమాలకు పెట్టింది పేరైన బోయపాటి దర్శకత్వంలో నటిస్తాడని వార్తలు వస్తోన్న నేపథ్యంలో… బొమ్మ అదిరిపోతుందంటూ సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Rider Teaser : నిఖిల్ కుమార్ హీరోగా నటించిన రైడర్ టీజర్ రిలీజ్.. ఈ సినిమా అయినా బ్రేక్ ఇస్తుందంటారా?