తల్లి చేయి విదుల్చుకుని అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చేసిన బాలుడు, హైదరాబాద్ రద్దీ రహదారిపై ఒక్కసారిగా కలవరం

| Edited By: Pardhasaradhi Peri

Dec 26, 2020 | 3:45 PM

రోడ్డెక్కితే ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. చిన్న పిల్లలతో వెళ్లే వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు..

తల్లి చేయి విదుల్చుకుని అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చేసిన బాలుడు, హైదరాబాద్ రద్దీ రహదారిపై ఒక్కసారిగా కలవరం
Follow us on

రోడ్డెక్కితే ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. చిన్న పిల్లలతో వెళ్లే వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు తప్పకపోవచ్చు. హైదరాబాద్ బాలానగర్‌లో ఇవాళ జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. బాలానగర్‌లోని బీబీఆర్ హాస్పిటల్ సమీపంలో ఓ తల్లి తన కొడుకుతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే బాలుడు తల్లి చేయి వదిలి రోడ్డు మీదకు పరిగెత్తాడు. అటుగా వస్తున్న ఓ బైక్‌ బాలుడిని ఢీ కొట్టింది. బైక్‌ ఒక్కసారిగా బాలుడిపై నుంచి వెళ్లిపోయింది. ఇది చూసిన వాహనదారుడు ఉలిక్కిపడ్డాడు. భయంతో కిందపడిపోయాడు. అయినా కూడా అదృష్టవశాత్తూ ప్రమాదంలో బాలుడికి ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదాన్ని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా బాలుడి వద్దకు పరిగెత్తారు. ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పారు. గాయాలేమీ కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ప్రమాదంపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.