వేదాల సాక్షిగా.. సంస్కృతంలో ప్రమాణస్వీకారం..

సౌత్ అమెరికాలోని సురినమే దేశంలో జూలై 16 న ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రికాప్రసాద్ సంతోకీ వేదాలసాక్షిగా సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఈ నెల ప్రారంభంలో

వేదాల సాక్షిగా.. సంస్కృతంలో ప్రమాణస్వీకారం..

Edited By:

Updated on: Jul 26, 2020 | 7:56 PM

సౌత్ అమెరికాలోని సురినమే దేశంలో జూలై 16 న ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశ నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రికాప్రసాద్ సంతోకీ వేదాలసాక్షిగా సంస్కృతంలో ప్రమాణం చేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పురోహితుడు చెబుతున్న సంస్కృత శ్లోకాలను చంద్రికా ప్రసాద్ పలుకుతూ ప్రమాణం చేయడం ఈ వీడియోలో గమనించవచ్చు. చంద్రికా ప్రసాద్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కావడం, అందులోనూ హిందువు కావడం వల్లనే ఈ విధంగా హిందూ సంప్రదాయంలో ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలుస్తోంది.

చంద్రికాప్రసాద్ సంతోకి ఫిబ్రవరి 3, 1959 న జన్మించాడు. తొమ్మిది మంది పిల్లలతో కూడిన కుటుంబంలో చిన్నవాడిగా గ్రామీణ ప్రాంతంలో పెరిగాడు. అతను అపెల్‌డోర్న్‌లోని పోలీస్ అకాడమీ ఆఫ్ నెదర్లాండ్స్‌లో నాలుగు సంవత్సరాలు చదువుకున్నాడు. అనంతరం పోలీస్ డిపార్టుమెంట్ లో పని చేయడానికి 1982 సెప్టెంబర్‌లో సురినామ్‌కు తిరిగి వచ్చాడు. 1991లో సంతోకి పోలీసు కమిషనర్‌గా నియమితులయ్యారు.

[svt-event date=”26/07/2020,7:30PM” class=”svt-cd-green” ]