రోహిత్ శర్మలో మరో షేడ్ ఉందట..

ధోనీలా ఆడే దమ్మున్న ఆటగాడు, సమయస్ఫూర్తిని కలిగిన నాయకుడు మరొకరు లేరనే అనిపిస్తుంది. కానీ.. ధోనీలో ఉన్న షేడ్స్‌ను తాను ఓపెనర్ రోహిత్‌ శర్మలో చూశానని టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేశ్ ‌రైనా...

రోహిత్ శర్మలో మరో షేడ్ ఉందట..
Follow us

|

Updated on: Jul 29, 2020 | 5:05 PM

ధోనీ.. మిస్టర్ కూల్ పేరును సొంతం చేసుకున్న నాయకుడు. ధోనీ సారథ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలను (టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ) భారత జట్టుకు గెలుచుకుంది. ధోనీ తర్వాత ఆ ప్లేస్ ను భర్తీ చేసేవారు ఎవరూ అనే ప్రశ్న వచ్చినప్పుడు ఓ పెద్ద క్వశ్ఛన్ మార్క్ కనిపిస్తుంది. ధోనీలా ఆడే దమ్మున్న ఆటగాడు, సమయస్ఫూర్తిని కలిగిన నాయకుడు మరొకరు లేరనే అనిపిస్తుంది. కానీ.. ధోనీలో ఉన్న షేడ్స్‌ను తాను ఓపెనర్ రోహిత్‌ శర్మలో చూశానని టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మన్‌ సురేశ్ ‌రైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్‌ జట్టులో హిట్‌మ్యాన్‌ మరో ధోనీ లాంటివాడని ప్రశంసల వర్షం కురిపించాడు.

తాజాగా సురేష్ రైనా ‘ది సూపర్ ఓవర్ పోడ్‌కాస్ట్‌ ‘తాజా ఎపిసోడ్‌లో భాగంగా సౌతాఫ్రికా క్రికెటర్‌ జేపీ డుమినితో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు సురేశ్ రైనా. ‘రోహిత్ శర్మ చాలా కామ్‌గా ఉంటాడు. ఎదుటి వాళ్లు చెప్పేది ఎంతో ఓపికగా వింటాడు. వాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడు. ముందుండి నడిపిస్తాడు. కెప్టెన్‌గా ఉన్నా డ్రెస్సింగ్‌ రూంలో అందరినీ గౌరవిస్తాడు. ప్రతీ ఒక్కరు కెప్టెన్ ‌లాంటి వాళ్లే కదా అంటాడు’ అని ఆకాశానికెత్తాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రైనా ఇప్పటివరకు 18 టెస్టుల్లో, 226 వన్డేల్లో, 78 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

‘‘అతను గొప్పవాడు, ఎంఎస్ ధోని తరువాత అతనే జట్టుకు సరియైన నాయకుడు. రోహిత్‌ ఐపీఎల్‌లో ధోని కంటే ఎక్కువ ట్రోఫీలను గెలుచుకున్నాడు. ఇద్దరూ కెప్టెన్‌గా వినడానికి ఇష్టపడతారు. ఒక కెప్టెన్‌ వినడానికి ఇష్టపడినప్పుడు చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. ఆటగాళ్ల మానసిక సమస్యలను పరిష్కరించవచ్చు. కాబట్టి నా పుస్తకంలో ఆ ఇద్దరు అత్యుత్తమం’’ అని రైనా చెప్పుకొచ్చాడు. సురేశ్ రైనా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వేదికగా ఓ చర్చకుదారి తీస్తున్నాయి.