‘దిశ’ హత్యాచారం కేసు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. తెలంగాణ ఖాకీలు చేసిన పనికి అందరూ శభాష్ అంటూ.. కొనియాడుతున్నారు. కానీ అనుకోని ట్విస్ట్‌గా ఈ కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తెరపైకి వచ్చింది. దీంతో.. కేసు మళ్లీ రీఓపెన్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో పిల్స్ దాఖలు అయ్యాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు తీసుకుంది.
ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్‌కౌంటర్‌పై తమకు పూర్తి అవగాహనలు ఉన్నాయని.. ఈ ఎన్‌కౌంటర్‌పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తామని.. అలాగే.. తెలంగాణ ప్రభుత్వం.. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తునకై సలహాలు, సూచనలతో రావాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ వద్ద ఉందన్న న్యాయస్థానం.. ఢిల్లీ నుంచే రిటైర్డ్ జిడ్జితో విచారణ జరుపుతారని.. దీనిపై తెలంగాణ హైకోర్టులో కూడా కేసు కొనసాగుతుందని తెలిపింది. కాగా.. ఈకేసును రేపటికి వాయిదా వేసింది న్యాయస్థానం.