మరోసారి విలన్‌ పాత్రలో కనిపించనున్న కమెడియన్ కమ్ హీరో..? ఈసారి ఎర్రచందనం స్మగ్లర్‌గా.?

|

Dec 23, 2020 | 2:32 PM

సునీల్ మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.

మరోసారి విలన్‌ పాత్రలో కనిపించనున్న కమెడియన్ కమ్ హీరో..? ఈసారి ఎర్రచందనం స్మగ్లర్‌గా.?
Follow us on

Sunil acts as vilan in bunny movie: కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారారు నటుడు సునీల్. అయితే కమెడియన్‌గా సంపాదించుకున్న పేరు, విజయాలను మాత్రం హీరోగా అందుకోలేక పోయారు. హీరోగా పలు వరుస అపజయాలు ఎదురుకావడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో ఎన్టీఆర్ స్నేహితుడు పాత్రతో తన పంథాను మరోసారి మార్చుకున్నారు సునీల్. ఇక అక్కడి నుంచి అడపాదడపా చిత్రాల్లో కనిపిస్తూ వస్తోన్న సునీల్.. రవితేజ హీరోగా తెరకెక్కిన ‘డిస్కో రాజా’లో ప్రతి నాయకుడి పాత్రలో కనిపించారు. కమెడియన్‌‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సునీల్ ఈ సినిమాలో తన విలనిజాన్ని చూపించారు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సునీల్ మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నారని చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే సునీల్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మొదట పలువురి పేర్లు వినిపించాయి. ఇందులో సునీల్ పేరు కూడా ఉంది. దీంతో పుష్పలో సునీల్‌ను విలన్ పాత్ర కోసమే తీసుకున్నారని చర్చ జరుగుతోంది. ఇందులో సునీల్ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించనున్నాడనేది సదరు వార్త సారాంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర విడుదల వరకు వేచి చూడాల్సిందే.