భారీ వర్షాలకు తోడు హైదరాబాదీలకు కొత్త సమస్య

|

Oct 15, 2020 | 7:31 PM

హైదరాబాద్ నగరంలో ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలు వాహనదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు నీట మునిగిన బైకులు, కార్లు మళ్లీ స్టార్ట్ అయ్యేందుకు మొరాయిస్తున్నాయి. ఇంజన్‌లోకి నీరు చేరటంలో బైక్స్‌ స్టార్ట్ కాని పరిస్థితి నెలకొంది.

భారీ వర్షాలకు తోడు హైదరాబాదీలకు కొత్త సమస్య
Follow us on

హైదరాబాద్ నగరంలో ఎడతెరపిలేకుండా కురిసిన భారీ వర్షాలు వాహనదారులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టాయి. ఇప్పటి వరకు నీట మునిగిన బైకులు, కార్లు మళ్లీ స్టార్ట్ అయ్యేందుకు మొరాయిస్తున్నాయి. ఇంజన్‌లోకి నీరు చేరటంలో బైక్స్‌ స్టార్ట్ కాని పరిస్థితి నెలకొంది. ఇక సెల్లార్‌లు, కాలనీ రోడ్లపై పెట్టిన కార్లు బ్యానెట్‌ వరకు మునిగిపోవడంతో వాటిని మెకానిక్ షెడ్‌లకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది.

జంటనగరాలతో పాటు శివార్లలో కురిసిన వర్షానికి, వచ్చిన వరదనీటి ప్రవాహానికి రోడ్లు ధ్వంసమైతే… చాలా కార్లు ఇన్ని రోజులు నీళ్లలోనే ఉన్నాయి. అపార్ట్‌మెంట్ సెల్లార్లు, ఇళ్ళల్లోకి నీరు చేరటంతో మోటార్ బైక్స్ పూర్తిగా నీట మునిగాయి. మైలార్‌దేవ్‌ పల్లి దగ్గర పల్లె చెరువు, గగన్‌పహాడ్‌ సమీపంలోని అప్పా చెరువు నీటి ఉధృతికి రోడ్లు పూర్తిగా దెబ్బతింటే… పదుల సంఖ్యలో కార్లు, బైకులు పూర్తిగా నీరు ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

ఇళ్ల ముందు పెట్టిన కార్లు, బైకులు మట్టిలో కూరుకుపోయాయి. వర్షాలు తగ్గుముఖం పట్టినా…వరదనీటిలో ఉన్న వాహనాలు మాత్రం పూర్తిగా ముందుకు కదల్లేని పరిస్థితులు తలెత్తింది. దీంతో వాహనదారులు మెకానిక్ షెడ్ బాట పడుతున్నారు. ఒకటి రెండు కాదు వందలాది కార్లు, వేల సంఖ్యలో బైకులు రిపేరింగ్‌ కోసం మెకానిక్‌ షెడ్లు, షోరూమ్‌లలో ఉన్నాయి.

గత వారం రోజులుగా కస్టమర్స్ పెరిగారని మెకానిక్ షెడ్ యజమానులు చెబుతున్నారు. అయితే సైలెన్సర్‌లోకి నీరు వెళ్ళకుండా చూసుకోవాలని వాహనదారులకు మెకానిక్‌లు సూచిస్తున్నారు.