డిఎస్సీ ఎగ్జామ్ పాసయిన వాళ్లు..మెరిట్ సంపాదించినవారు ప్రభుత్వ టీచర్లు అవుతారు. డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్లు, నార్మల్ ఎంబిఏ, ఎంసీఏ పాస్ అయినవాళ్లు ప్రవేట్ పాఠశాలల్లో స్టాఫ్‌గా పనిచేస్తారు. అలాంటప్పుడు విద్యార్థుల పాస్ పర్సంటేజ్ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఎక్కువగా ఉండాలి. కానీ అందుకు విరుద్దంగా ప్రవేట్ స్కూల్స్ దుమ్మరేపుతున్నాయి. చాలా ప్రవేట్ స్కూల్స్ సెంట్ పర్సెంట్ ఉత్తీర్ణతో సత్తా చాటుతున్నాయి. మ్యాటర్ ఎక్కడో తేడా కొడుతోంది. ఈ విషయంపైనే దృష్టి పెట్టారు ఇటీవలే హైదరాబాద్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన శ్వేతా మహంతి.
తాజాగా ఆమె ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు పాస్ చేసినట్టు తెలుస్తోంది. ఒక్కో టీచర్ కొంతమంది స్టూడెంట్స్‌ని అడాప్ట్ చేసుకుని వారిని పాస్ అయ్యేలా ముందుకు నడిపించాలని ఆమె తేల్చి చెప్పారట. ఒకవేళ స్టూడెంట్స్ ఫెయిల్ అయితే టీచర్స్ నుంచి అడంర్ టేకింగ్ లెటర్స్ తీసుకోవాలని కూడా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. అందుకు సంబంధిచిన ప్రాసెస్ కూడా డీఈవో, హెచ్‍ఎంలు ప్రారంభించడంతో..టీచర్లు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నారు. స్టూడెంట్ ఫెయిల్ అవ్వడానికి 100 కారణాలు ఉంటాయని, ఇలా మమ్మల్ని బాద్యుల్ని చేస్తే ఎలా అని వాపోతున్నారట. దీంతో టీచర్ యూనియన్ నేతలు..డీఈఓని కలిసి చర్చలు జరిపారు. పిల్లలను పాస్ అయ్యేలా అనేక విద్యావిధానాలు అమలు చేస్తున్నామని.. ఎప్పుడూ లేనిది కొత్తగా ఈ సంస్కృతి ఏంటని గట్టిగా ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. దీంతో వెనక్కి తగ్గిన డీఈఓ అక్‍నాలెడ్జ్‌మెంట్ ఐనా ఇవ్వాలని కోరారట. దానికి కూడా టీచర్ యూనియన్ నేతల విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి కలెక్టర్ శ్వేతా మహంతి ఈ ఇష్యూపై ఎలా రెస్పాండ్ అవుతారో వేచి చూడాలి. కాగా శ్వేతా మహంతి తాను ఎక్కడ పనిచేసినా తనదైన మార్క్ ఉండేలా పనిచేస్తారు. కేవలం విద్యావ్యవస్థలోనే కాదు..అన్ని విభాగాల్లోనూ వినూత్న మార్పులు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం జరిపిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో.. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌కు ఆమెను బదిలీ చేశారు. కాగా శ్వేతా మహంతి 2011 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని. అప్పుడు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ కూడా.
హైదరాబాద్ నూతన కలెక్టర్ శ్వేత మహంతి